రజినీకాంత్ 'జైలర్' మూవీలో రమ్యకృష్ణ..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . రజినీ కాంత్ కొంత కాలం క్రితం విడుదలైన పెద్దన్న మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది . ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో షూటింగ్ ప్రారంభం కాబోయే జైలర్ మూవీ లో రజనీ కాంత్ హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ కి తమిళ దర్శకుడు అయిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు.

సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించనున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ అంతా కూడా ఒక జైలు సెట్ లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన సెట్ పనులు కూడా ప్రస్తుతం జరుగుతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా ఈ మూవీ లో రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించబోతోంది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రమ్యకృష్ణ నటించడం కన్ఫామ్ అయినట్లుగా తెలుస్తోంది. రేపటి నుండే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

ఈ సినిమా షూటింగ్ లో సూపర్ స్టార్ రజినీ కాంత్ ఈ నెల 22 వ తేదీ నుండి జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఇది వరకు రజనీకాంత్ , రమ్యకృష్ణ కాంబినేషన్ ల్9 తెరకెక్కిన నరసింహ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో మన అందరికీ తెలిసిందే. మరో సారి ఈ ఇద్దరి కాంబినేషన్నాలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో రజనీ కాంత్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రముఖులు కూడా ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: