4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 'బింబిసార' మూవీ సాధించిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
కళ్యాణ్ రామ్ 'ఎంత మంచి వాడవురా' మూవీ తర్వాత తాజాగా బింబిసార మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన క్యాథరీన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించగా , ఈ మూవీ కి మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఆగస్ట్  5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఆ అంచనాలకు తగినట్టుగా ఈ సినిమా కూడా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కె బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి. బింబిసార మూవీ నాలుగు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.


నైజాం : 6.55 కోట్లు ,
సీడెడ్ : 3.96 కోట్లు ,
యూ ఏ : 2.61 కోట్లు ,
ఈస్ట్ : 1.16 కోట్లు ,
వెస్ట్ : 84 లక్షలు ,
గుంటూర్ : 1.42 కోట్లు ,
కృష్ణ : 1.00 కోట్లు ,
నెల్లూర్ : 56 లక్షలు .
నాలుగు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో బింబిసార మూవీ 18.10 కోట్ల షేర్ , 28.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 1.23 కోట్లు ,
ఓవర్ సీస్ లో : 1.52 కోట్లు .
నాలుగు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా బింబిసార మూవీ 20.85 కోట్ల షేర్ , 34.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: