రేపు ఆ సమయానికి విడుదల కానున్న నిఖిల్ 'కార్తికేయ 2' ట్రైలర్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోల్లో ఒకరు అయిన నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్, శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన హ్యాపీ డేస్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత అనేక విజయవంతమైన మూవీ లలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు.
 

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కొనసాగుతున్న నిఖిల్ తాజాగా కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ లో హీరో గా నుష్టించాడు.  ఈ మూవీ కి చందు మొండేటి దర్శకత్వం వహించగా, అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఆగస్ట్ 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో  ఈ సినిమా బృందం కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను ఆగస్ట్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను రేపు అనగా జులై 6 వ తేదీన సాయంత్రం  4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి కార్తికేయ 2 మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై మంచి విజయం సాధించిన కార్తికేయ మూవీ కి కార్తికేయ 2 సినిమా సీక్వెల్ గా తెరకెక్కడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: