బ్రాండ్ బాబుగా మారిన అల్లు అర్జున్...!!

murali krishna
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. బన్నీ నటిస్తున్న పుష్ప ది రూల్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట..


అయితే గత కొంతకాలంగా వరుసగా యాడ్లలో నటిస్తూ బన్నీ బిజీగా ఉన్నారు. ఈ యాడ్ల ద్వారా బన్నీ కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయం సొంతం చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది. బన్నీ బాబు కాదు బ్రాండ్ బాబు అని వరుసగా ప్రముఖ బ్రాండ్లలో బన్నీ నటిస్తుండటంతో కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు.


పుష్ప ది రైజ్ తో బన్నీకి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు దక్కింది. సెప్టెంబర్ నుంచి పుష్ప ది రూల్ సెట్స్ పైకి వెళ్లనుండగా ఈ సినిమాతో అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. కొన్నిరోజుల క్రితం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొన్న బన్నీ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొంటున్నారనే విషయం తెలిసిందే.


బన్నీకి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండటంతో ప్రముఖ కంపెనీలు ప్రస్తుతం బన్నీపైనే దృష్టి పెడుతున్నాయి. బన్నీ యాడ్స్ ద్వారా భారీస్థాయిలోనే సంపాదిస్తున్నారని కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. పుష్ప ది రూల్ కూడా విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటే మాత్రం బన్నీ క్రేజ్ మరింత పెరగడం గ్యారంటీ అని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.


  సినిమాసినిమాకు బన్నీ రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఒక్కో ప్రాజెక్ట్ కు బన్నీ 50 కోట్ల రూపాయల నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారట  . ఐకాన్ స్టార్ గా ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్ ఉండటం వల్లే బన్నీ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: