నేను కాదంటేనే మహేష్ సినిమాలో అతడికి అవకాశం వచ్చింది... వేణు తొట్టెంపూడి..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వేణు తొట్టెంపూడి ఆ తర్వాత అనేక సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వేణు తొట్టెంపూడి గురించి కొత్తగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వేణు తొట్టెంపూడి 1999 వ సంవత్సరంలో విడుదల అయిన స్వయంవరం మూవీ తో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు.

ఈ సినిమాకు కె విజయ భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు హీరోగా వేణు కి కూడా ఈ మూవీ మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించిన వేణు మంచి విషయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకని ఎన్నో సంవత్సరాల పాటు హీరో గా తన కెరియర్ ను అద్భుతంగా కొనసాగించాడు. అలాగే ఎన్నో సినిమాల్లో ఇతర ముఖ్యమైన పాత్రల్లో కూడా నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు గత కొన్ని సంవత్సరాలుగా ఏ సినిమాలో కూడా నటించడం లేదు అన్న విషయం మనకు తెలిసిందే. చాలా సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న వేణు తాజాగా రవితేజ హీరోగా శరత్ మండువ దర్శకత్వంలో తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ తో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఈ సినిమా ఈ రోజు అనగా జూలై 29 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న వేణు తాజాగా ఓ ఇంటర్వ్యూ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ ... త్రివిక్రమ్ సినిమాలో నాకు సరిపడే క్యారెక్టర్ ఉంటే కచ్చితంగా చెప్తారు. అతడు మూవీ లో సోనూసూద్ పాత్ర మొదట నాకు చెప్పారు. నేను చేయకపోతే తర్వాత సోనూసూద్ చేశాడు అని వేణు తాజా ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: