చీరకట్టులో మరోసారి అందచందాలను ఆరబోసిన అనసూయ..!

Pulgam Srinivas
గ్లామరస్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు దక్కించుకొని ఎంతో మంది బుల్లితెర అభిమానుల మనసులు దోచుకున్న అనసూయ ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది .
 

అందులో భాగంగా ఇప్పటికే అనసూయ ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలలో నటించింది . ఇలా అనసూయ ఇప్పటికి ఎన్నో సినిమాలలో నటించిన క్షణం సినిమా లోని ప్రతి నాయక పాత్ర కి , రంగస్థలం మూవీ లోని రంగమ్మత్త పాత్రకి ,  అలాగే కొంత కాలం క్రితం విడుదల అయిన పుష్ప మూవీ లోని దాక్షాయణి పాత్రకి ఇటు ప్రేక్షకుల  నుండి, అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి .  ప్రస్తుతం కూడా అనసూయ వరుస మూవీ లలో నటిస్తూనే , వరుస టీవీ షో లకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తుంది. ఇలా టీవీ షో లను మరియు సినిమాలను సమానంగా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
 

అలాగే ఈ గ్లామరస్ యాంకర్ మరియు నటి అయిన అనసూయ సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ తన అందచందాలు ప్రదర్శితమయ్యేల ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా అనసూయ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో అనసూయ అందమైన చీరకట్టులో అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లౌస్ ను ధరించి తన ఫ్రెంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితమయ్యేల ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: