కిచ్చ సుదీప్ 'విక్రాంత్ రోనా' మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
కన్నడ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న కిచ్చ సుదీప్  తాజాగా విక్రాంత్ రోనా అనే భారీ బడ్జెట్ యాక్షన్ మిస్టరీ ట్రైలర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ ని కన్నడ తో పాటు తెలుగు , తమిళ , మలయాళ ,  హిందీ భాషల్లో నిన్న అనగా జూలై 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల చేశారు.

ఈ మూవీ ని 2 డి మరియు 3 డి వెర్షన్ లలో మూవీ యూనిట్ విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటిబ్ రోజు దక్కాయి. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ కి మొదటి రోజు బాక్సా పీస్ దగ్గర మంచి కలెక్షన్ లు దక్కాయి. మొదటి రోజు విక్రాంత్ రోనా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

నైజాం : 41 లక్షలు , సీడెడ్ : 12 లక్షలు , యూ ఏ : 13 లక్షలు , ఈస్ట్ : 8 లక్షలు , వెస్ట్ : 6 లక్షలు , గుంటూర్ : 10 లక్షలు , కృష్ణ : 7 లక్షలు , నెల్లూర్ : 5 లక్షలు , మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో విక్రాంత్ రోనా మూవీ 1.02 కోట్ల షేర్ , 1.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను సాధిస్తుందో చూడాలి. ఈ మూవీ కి అనూప్ బండారి దర్శకత్వం వహించగా ,  జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: