నేను రీఎంట్రీ ఇవ్వడానికి కారణం అదే అంటున్న వేణు..!!

Divya
స్వయంవరం సినిమాతో మంచి ఇమేజ్ను తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి.. ఆ తరువాత హనుమాన్ జంక్షన్ సినిమాతో కమర్షియల్ హీరోగా పేరుపొందారు. గతంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన వేణు ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించారు. ఇక ఎవరు ఊహించని కామెడీ పంచ్ డైలాగులతో ఎంతగానో అలరించిన ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు కానీ సినీ ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చే వారిలో వేణు ముందు వరుసలో ఉండేవారు. అలా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మొదటిసారి వేణు ద్వారానే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
స్వయంవరం చిత్రానికి త్రివిక్రమ్ కథలు మాటలు అందించారు ఇక ఆ తర్వాత వేణు 2009వ సంవత్సరం వరకు చాలా బిజీగా సినిమాలు చేశారు.. ఇతని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ను అందుకున్నాయి. చివరిగా నటించిన చిత్రం గోపి గోపిక గోదావరి ఇక ఈ సినిమా తర్వాత అంతగా సినిమాలు తీయకపోవడంతో దమ్ము సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించాడు. ఇక 2013లో రామాచారి అనే సినిమా వేణు కెరియర్ లో భారీ డిజాస్టర్ కావడంతో ఇక మళ్ళీ సినిమాల వైపు తిరిగి చూడలేదు తన వ్యాపారాలతోనే బిజీగా మారిపోయారు.. ప్రస్తుతం రవితేజ సినిమాలో నటించే అవకాశం దక్కింది.
ఇక దీంతో రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రియంట్రి ఇస్తున్నారు. ఇవ్వడానికి గల కారణాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఎక్కువగా తన వ్యాపారాలతో బిజీగా ఉండడం వల్ల పలు సినిమాలలో నటించే అవకాశం వచ్చినా కూడా మధ్యలో చేయలేకపోయాను అయితే లాక్ డౌన్ సమయంలో కొన్ని వెబ్ సిరీస్ లు ఓటీటి లో సినిమాలు చూడడం వలన తనకు మళ్ళీ నటించాలనే కోరిక పుట్టిందని తెలిపారు. నేను వెండితెరకు దూరమయ్యాను అనే భావన కలిగింది అని తెలిపారు అదే సమయంలో డైరెక్టర్ శరత్ మండవ నేను మీ అభిమానిని అంటూ ఒకసారి కలవాలని తన దగ్గరకు వచ్చారట. కానీ కథ చెప్పగానే బాగా కనెక్ట్ అవడంతో ఈ సినిమాలో నటిస్తానని చెప్పాడట. అయితే ఈ సినిమాలో తన పాత్ర నెగిటివ్ , పాజిటివ్ అనే కాకుండా ఒక చాలెంజ్గా ఉంటుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: