సమంత కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Divya
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సమంతా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తన నటనతో.. అందంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల స్టార్ హీరోయిన్ గా చలామణి అవ్వడమే కాకుండా శాకుంతలం , యశోద వంటి సినిమాలతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరుగా మారిపోయింది. ఇక మరొకవైపు విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాలో పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది.
ఇకపోతే ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి ఇమేజ్ సొంతం చేసుకోవాలి అంటే ఆ వెనుక వారు ఎంత కష్టపడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చిరంజీవి , శ్రీకాంత్,  రవితేజ వంటి వారు ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి నేడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నారు. ఇక సమంత కూడా ప్రస్తుతం ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతుందంటే.. దాని వెనుక ఎంత కష్టపడిందో ప్రతి ఒక్కరికి తెలియాల్సి ఉంది. ఇకపోతే డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే తినడానికి తిండి లేక ఒకపూట మాత్రమే భోజనం చేస్తూ చదువును కొనసాగించలేకపోయింది.
ఆ తర్వాత పెద్ద పెద్ద ఫంక్షన్లకు పెద్దవాళ్లను వెల్కమ్ చెప్పే వెల్కమ్ అమ్మాయిగా పనిచేసి 500 రూపాయలను పారితోషకంగా పొందింది. ఆ తర్వాత పలు బంగారు నగలకు అలాగే బట్టలకు సంబంధించిన యాడ్ లో కూడా నటించి సుమారుగా 2000 రూపాయల వరకు సంపాదించేది. కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మళ్ళీ తన చదువును పూర్తి చేసి టాపర్గా నిలిచింది సమంత. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన నటనతో ప్రేక్షకులను మెప్పించి స్టార్ హీరోల సరసన నటించి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతూ నేడు కొన్ని కోట్ల రూపాయల పారితోషకం తీసుకునే స్థాయికి చేరింది సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: