జూనియర్ ఎన్టీఆర్ కి హరికృష్ణ పెట్టిన పేరేంటో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.ఈయన  ఆర్ఆర్ఆర్ థియేటర్లలో విడుదలై మూడు నెలలు దాటినా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియా, వెబ్ మీడియాలో చర్చ జరుగుతోంది.అయితే ఇక ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తండ్రి హరికృష్ణ పెట్టిన పేరు ఏమిటి? అనే ప్రశ్నకు ఇప్పుడు  తారక్ అభిమానుల్లో కూడా చాలామందికి సమాధానం తెలియదు.

అయితే సీనియర్ ఎన్టీఆర్ కొడుకుల పేర్లలో కృష్ణ ఉండగా హరికృష్ణ మాత్రం తన కొడుకుల పేర్లలో రామ్ ఉండేలా చూసుకున్నారు. ఇకపోతే హరికృష్ణ తన కొడుకులకు జానకి రామ్, కళ్యాణ్ రామ్, తారక్ రామ్ అని పేరు పెట్టారు.  జూనియర్ ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ ను 11 ఏళ్ల వయస్సులో కలవగా సీనియర్ ఎన్టీఆర్ తారక్ రామ్ పేరును తారక రామారావుగా మార్చారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న సమయంలో ఈ ఆసక్తికర విషయాల గురించి చెప్పుకొచ్చారు.ఆయన తాత సీనియర్ ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో అని శ్రీదేవి తన ఫేవరెట్ హీరోయిన్ అని జూనియర్ ఎన్టీఆర్ ఒక సందర్భంలో వెల్లడించారు.

ఇక  ఆర్ఆర్ఆర్ కు 45 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్న తారక్ తర్వాత సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. కాగా తారక్ తర్వాత ప్రాజెక్ట్ లకు కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.పోతే  ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే నిర్మాతగా కళ్యాణ్ రామ్ కు కూడా మంచి లాభాలు దక్కే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.ఇక కళ్యాణ్ రామ్ ప్రస్తుతం బింబిసార సినిమాలో నటిస్తుండగా ఆగష్టు నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బాగానే అంచనాలు నెలకొన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: