పుష్ప 2 కోసం ఆయననే దింపుతున్నారు గా!!

P.Nishanth Kumar
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప రెండవ భాగం చిత్రం యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. దర్శకుడు సుకుమార్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కొన్ని రోజుల నుంచి స్క్రిప్ట్ పనులు చేస్తున్నారు. ఈ రెండవ భాగం సినిమా తప్పకుండా భారీ రికార్డులను వసూళ్లు చేస్తుందన్న నమ్మకంతో చిత్ర బృందం ఉంది. మొదటి భాగం సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన రికార్డు స్థాయి విజయాన్ని మించేలా ఈ చిత్రం ఉండాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారు. స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయగా బాలీవుడ్ లోనే ఈ సినిమాకు రికార్డు స్థాయి విజయం దక్కింది.

 అలా ఈ మూవీ సాధించిన వసూళ్లు అంతటా చర్చనీయాంశంగా మారగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ రెండవ భాగాన్ని నిర్మించడానికి చిత్ర బృందం సిద్ధమవుతుంది. రస్మిక హీరోయిన్ గా నటిస్తున్నగా ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు జూలై లేదా ఆగస్టులో సెట్స్ పైకి వెళ్తుంది. తాజాగా ఈ సినిమాలో మరొక విలక్షణ నటుడిని తీసుకుపోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే పహాద్ ఫాజిల్ బన్వర్ సింగ శకవత్ గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆయన పాత్రకు తోడుగా విజయ్ సేతుపతి మరొక కీలకమైన పాత్రలో నటించే విధంగా అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీరిద్దరూ క్రేజ్ ఏ స్థాయిలో సినిమాకు ఉపయోగపడుతుందో చూడాలి. మరి తమిళ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా దగ్గర ఇవ్వాలనే ఉద్దేశంతో సుకుమార్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.   విజయ్ సేతుపతి కి విక్రమ్ సినిమా ద్వారా పలు భాషలలో మంచి క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన కు ఉన్న క్రేజ్ ఈ సినిమాకు బాగానే ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.  మరి ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతున్న నేపథ్యంలో విడుదల తరువాత ఎన్ని రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: