మారుతి , ప్రభాస్.. ఇదేంటబ్బా!!

P.Nishanth Kumar
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు గత కొన్ని రోజులుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో షికార్లు చేస్తున్నాయి. ప్రభాస్ మారుతి వినిపించిన కథకూ ఓకే చెప్పాడని అతి తక్కువ కాలంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని అన్నారు కానీ ఎంతకీ సినిమా పట్టాలు ఎక్కక పోవడం ఈ సినిమా అసలు తెరకుఎక్కుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్కా కమర్షియల్ అనే సినిమా విడుదల ఉన్న నేపథ్యంలో దర్శకుడు మారుతి ఇప్పుడు ఆ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు.

 గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయం సాధిస్తే తప్పకుండా ప్రభాస్ తో ఆయన సినిమా ఒకే అయిపోయినట్లే అని ప్రభాస్ అభిమానులు అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇదొక హారర్ సినిమా అని డీలక్స్ రాజా అనే టైటిల్ ను ఆ సినిమాకు పెట్టారు అని చెప్పుకొచ్చారు కానీ ప్రభాస్ నటిస్తు న్న ఇతర సినిమాలకు సంబంధించిన అప్డేట్ వస్తున్నాయి కానీ సినిమా అప్డేట్ రాకపోవడం అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది. 

ప్రభాస్ నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో ప్రభాస్ ఈ సినిమా చేయడానికి వెనకడుగు వేశార ని అంటున్నారు. విజయాలు సాధిస్తే తప్పకుండా ప్రభాస్ ఈ సినిమా గురించి ఆలోచించే వాడని అతి తక్కువ కాలంలోనే తెరకెక్కించి తన అభిమానులకు గుడ్ న్యూస్ అందజేయాల ని ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు. మరి ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెడతాడో అనే విషయం చూడాలి. ఇప్పుడు సలార్ చిత్రంపైనే ప్రభాస్ పూర్తి దృష్టి సారించా డు ఈ చిత్రం తప్పకుండా భారీ విజయాన్ని అందుకోవాలని ప్రశాంత్ తో కలసి పని చేస్తున్నాడు. ఆ తర్వాత ఆది పురుష్, ప్రాజెక్ట్ కే సినిమాలు కూడా ఆమె చేస్తుంది. మారుతి సినిమా యొ క్క అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: