ఏజెంట్ ట్విస్ట్ కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Satvika
అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అవ్వడం తో ఇప్పుడు వరుస హిట్ సినిమాలలో  నటిస్తూ బిజిగా ఉన్నాడు అఖిల్.. అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ స్పై థ్రిల్లర్ మూవీ 'ఏజెంట్' ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అఖిల్ భారీగా బాడీని పెంచిన సంగతి తెలిసిందే. జిమ్‌లో కష్టపడి మ్యాచో లుక్‌లోకి మారిపోయాడు. ఇక ఈ సినిమాలో అఖిల్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌ లు హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమాలో ఏజెంట్‌గా అఖిల్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది..

సినిమాలో ఏజెంట్ ఇచ్చే ట్విస్ట్‌ తో ఆడియెన్స్ ఫ్యూజులు ఎగిరిపోతాయని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఏజెంట్‌ గా అఖిల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆడియెన్స్‌ ను అబ్బురపరుస్తుందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఇంటర్వెల్ బ్లాక్ ఈ సినిమా ను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని వారు అంటున్నారు. ఈ సినిమా లో అఖిల్ ఇచ్చే ట్విస్ట్ మామూలుగా ఉండదని, ప్రేక్షకుల ఊహకు ఏమాత్రం అందకుండా ఈ ఇంటర్వెల్ బ్లాక్ ఉండబోతున్నట్లు మేకర్స్ అంటున్నారు.

ఏది ఎలా ఈ సినిమాపై ఆ చిత్ర దర్సక, నిర్మాతలు చాలా ఒప్స్ పెట్టుకున్నారు.సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా లో అఖిల్ సరసన అతుల్యా రవి, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కు వక్కంతం వంశీ కథను అందించగా, హిప్‌హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది... ఈ సినిమా కూడా సక్సెస్ అయితే మాత్రం అఖిల్ పేరుకు డిమాండ్  భారీగా పెరుగుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: