బోయపాటి సినిమాలో నటించనున్న కోలీవుడ్ స్టార్ హీరో...!!

murali krishna
యాక్షన్ హీరో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే.


ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకోనుంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ మొదలు కాకుండానే ఈ సినిమా నుంచి అప్డేట్ విడుదల చేస్తూ భారీ అంచనాలను పెంచుతున్నారట .


ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లోకేషన్లను పరిశీలించిన అనంతరం ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో దర్శకుడు ఎంతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో రామ్ సరసన నటించడానికి పరిణితిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.. ఇప్పటికే ఈమెతో చర్చలు జరగా ఈ సినిమాలో నటించడానికి ఈమె సానుకూలంగా ఉందని దాదాపు పరిణితి చోప్రా ఈ సినిమాలో కన్ఫర్మ్ అయిందని వార్తలు కూడా వస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో హీరో రామ్ తో పాటు మరొక హీరోని కూడా రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.


తెలుగులో ఎంతో మంచి క్రేజ్ ఉన్నటువంటి తమిళ హీరో శివ కార్తికేయన్ ఈ సినిమాలో మరో హీరోగా తీసుకోవాలనే ఆలోచనలో బోయపాటి ఉన్నట్లు సమాచారం.ఈ విధంగా ఈ సినిమాలో మరొక హీరో ఉన్నారనే వార్త తెలియడంతో వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాను బోయపాటి మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కించబోతున్నారా అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.


ఇకపోతే త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈయన నటించిన ది వారియర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉందటఈ చిత్రాన్ని కూడా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: