పుష్ప -2 లో ఆ హీరో నటిస్తున్నాడా.. అసలు విషయం ఇదే..?

Divya
అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని చెప్పవచ్చు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో విజయాన్ని అందుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా సునామి సృష్టించింది. గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో పాటు ఇతర భాషల్లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక అక్కడ సాధించిన ఈ చిత్రం వసూలు ప్రస్తుతం ట్రెండ్ సర్కిల్ లో చర్చనీయాంశంగా మారుతోంది
ఈ నేపథ్యంలోనే పుష్ప -2 చిత్రంపై మరింత భారీగా అంచనాలు ఉన్నాయి ప్రేక్షకులకు. అందుకోసం స్క్రిప్టులో భాగంగా పలు మార్పులు కూడా చేశారు సుకుమార్. మొదటి పార్టీ ని మించి పోయే విధంగా పార్ట్-2 ని దాదాపుగా  రూ. 400 కోట్లతో నిర్మించబోతున్నారు. అందుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టారు చిత్రబృందం. హీరోయిన్ రష్మిక నటిస్తున్నది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా ఆగస్టు నెలలో షూటింగ్ మొదలు కానున్న ట్లు తెలుస్తోంది అయితే ఇప్పుడు తాజాగా ఇందుకు సంబంధించి ఒక వార్త నెట్టింట్లో వైరల్ గా మారుతోంది.
అదేమిటంటే పుష్ప -2 లో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తమిళ హీరో విజయ్ సేతుపతి నటించబోతున్నాడని వార్త వినిపిస్తోంది. ఇక మొదటి భాగంలో ఫాహద్ ఫాజిల్ నటించారు ఇక ఈయనకు బాస్గా విజయ్ సేతుపతి నటించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ముందుగా ఈ సినిమాలో ఒక పాత్ర కోసం విజయ్ సేతుపతి అనుకో గా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. మరి ఈసారైనా విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటిస్తాడో లేదో అనే విషయం చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: