టాలీవుడ్ హీరోలపై ఫోకస్ పెట్టిన కోలీవుడ్ డైరెక్టర్లు వీరే..!

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొన్ని క్రేజీ సినిమాలు తెరకెక్కుతున్నాయి . అందులో కొన్ని  మూవీ లలో టాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తూ ఉంటే , ఆ సినిమాలకు కోలీవుడ్ క్రేజీ దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారు . ప్రస్తుతం టాలీవుడ్ హీరోల మూవీ లకు దర్శకత్వం వహిస్తున్న కోలీవుడ్ దర్శకుల గురించి తెలుసుకుందాం .


కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ దర్శకులలో ఒకరుగా కొనసాగుతున్న శంకర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు . ఈ మూవీ ని శంకర్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నాడు . ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతుంది . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది . ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ నటిస్తోంది.


కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు ఆయన లింగుస్వామి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అండ్ ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న ది వారియర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని జూలై 14 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.


తమిళ ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకట్ ప్రభు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు ఆయన నాగ చైతన్య హీరోగా ఒక సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా జరిగిపోయింది. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా కనిపించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: