సల్మాన్ వీడియోపై స్పందించిన సమంత..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ సమంత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీ లో 'ఊ అంటావా మావా' అనే  ఐటమ్ సాంగ్ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ సినిమా విడుదలకు ముందే ఇండియా  రేంజ్  లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.

ఆ తర్వాత ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఈ మూవీ లోని స్పెషల్ సాంగ్ కు సమంత వేసిన స్టెప్ లు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఫుల్ వైరల్ అయ్యింది. అలాగే ఈ సాంగ్ ఇప్పటికే మిలియన్ ల కొద్ది వ్యూస్ ను యూట్యూబ్ లో శాసించి ముందుకు దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే పుష్ప మూవీ లో సమంత చేసిన ఐటమ్ సాంగ్ కి ఇప్పటికి ఎంతో మంది సెలబ్రిటీలు సైతం కాలు కదిపారు. ఇది ఇలా ఉంటే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సల్మాన్ ఖాన్ కూడా పుష్ప మూవీ లో సమంత చేసిన ఐటమ్ సాంగ్ పై తాజాగా స్పందించాడు.

తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ ను యాంకర్ మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సాంగ్ కానీ ... సినిమా కానీ ఏదైనా ఉంది అని ప్రశ్న అడగగా... ఆ ప్రశ్నకు సల్మాన్ ఖాన్ 'ఊ అంటావా మావా' అని హమ్ చేశాడు. అలాగే తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు సల్మాన్ ఖాన్ తన తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసాడు.  ఈ వీడియోను చూసిన సమంత రెడ్ కలర్ హాట్ సింబల్స్ ఎమోజీ లను కామెంట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: