సమంత కు ఇంత క్రేజ్ ఎలా సాధ్యం బాసు..!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా మంచి క్రేజ్ తో ఉంది సమంత. పెళ్లి తర్వాత కూడా ఆమె అదే స్థాయిలో క్రేజ్ ని దక్కించుకుని ప్రేక్షకులను అలరించింది. విడాకుల తర్వాత కూడా ఆమె క్రేజ్ కు ఏ మాత్రం ధోకా లేదనే చెప్పాలి. నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత మనస్పర్థల వల్ల విడిపోయిన వీరిద్దరూ ఇప్పుడు తమ తమ కెరియర్ ల పై ఫోకస్ పెట్టుకున్నారు. ఆ విధంగా సమంత తన కెరీర్లో నిలదొక్కుకోవాలని చెప్పి ఇప్పుడు వరుస సినిమాలను చేస్తుంది.

పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న సమంత హీరోయిన్ గా కూడా మళ్లీ తన సత్తాను చాటే విధంగా ప్లాన్ సిద్ధం చేసుకుంది. విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న సమంత మరో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తూ ఉండడం ఆమె అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమా ఇప్పటికే పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

ఇంకొకవైపు యశోద అనే మరొక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా ఆమె చేసింది. ఆ చిత్రం యొక్క షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతుంది. అయితే ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గిపో లేదని ప్రముఖ సంస్థ వెల్లడించిన సర్వేలను బట్టి తెలిసింది. సౌతిండియన్ హీరోయిన్ లలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ఎవరూ అంటే ఆమెకి దక్షిణాది ప్రేక్షకులు ఎక్కువగా ఓట్లు వేశారు. ఈ నేపథ్యంలో దక్షిణాదిన ఆమెకు ఎంత క్రేజ్ ఉందో దీన్నిబట్టి తెలిసిపోయింది. పెళ్లయిన తర్వాత ఏ హీరోయిన్ కూడా ఇంతటి క్రేజ్ తో ముందుకు సాగదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈమె నెంబర్ వన్ గా ఎదగడం నిజంగా ఆమె ఒక్క క్రేజ్ ను ప్రపంచానికి చాటి చెప్పినట్లవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: