ప్రభాస్ పై ఫ్లాప్ ల ప్రభావం లేదా..!!

P.Nishanth Kumar
ఎవరైనా హీరో వరుస ఫ్లాపులతో ఉంటే తప్పకుండా సదరు హీరో పై దాని ప్రభావం గట్టిగానే ఉంటుంది. ఆయనకు మార్కె ట్ తగ్గిపోవడం, పేరున్న దర్శకులు సినిమా చేయకపోవడం పెద్ద నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విషయం లో మాత్రం ఇది జరగడం లేదు. బాహుబలి సినిమా తర్వాత ఆయన చేసిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలా ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ లు గా మిగిలిపోయాయి.

ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు ఫ్లాప్స్ గా మారడం ప్రభాస్ కెరియర్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని కొంతమంది సినిమా విశ్లేషకులు భావించారు. కానీ అంతకంతకూ ఈయన సినిమాల కోసం రెమ్యునరేషన్ పెంచడం ఒక్కసారిగా అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల కోసం తీవ్రంగా వందకోట్ల పారితోషకం తీసుకుంటున్నాడట. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ చిత్రాన్ని ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. 

ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన భాగం యొక్క షూటింగ్ ను త్వరలోనే మొదలు పెట్టబోతున్నాడు. ఇక ఆయన హీరోగా నటించిన ఆదిపురుష్ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రం భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని చిత్రబృందం భావిస్తోంది. అన్ని భాషలలోనూ మార్కెట్ కలిగిన ప్రభాస్ ను ఈ చిత్రానికి హీరోగా ఎంచుకుంది. ఇక మారుతి దర్శకత్వంలో ఒక సినిమా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా ను ప్రభాస్ ఒప్పుకున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమాని వచ్చే ఏడాది మొదలు పెట్టబోతున్నాడు. మరి రాబోయే సినిమాల కోసం ప్రభాస్ ఏ స్థాయిలో పారితోషకాన్ని అందుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: