పవన్ సినిమా నుంచి తప్పుకున్న పూజా హెగ్డే.. కారణం అదేనట?

praveen
ఇటీవలి కాలంలో సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది పూజా హెగ్డే.. స్టార్ హీరో సినిమా ఏదైనా తెరమీదికి వచ్చింది అంటే చాలు ఆ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే కన్ఫార్మ్ అయిపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో ఈ అమ్మడు నటించిన రాధేశ్యామ్ ఆచార్య బీస్ట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డీలా పడి డిజాస్టర్ గా మిగిలిపోయాయి. అయినప్పటికీ ఈ అమ్మడి క్రేజ్ మాత్రం తగ్గలేదు అని చెప్పాలి. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న పూజా హెగ్డే ఇక పవన్ కళ్యాణ్ తో కూడా ఓ సినిమా చేస్తోంది.

 హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది ఈ సొగసరి. దీంతో పవన్ కళ్యాణ్ పూజా హెగ్డే మిషన్ ఎలా ఉండబోతుందో అనేదానిపై అభిమానులు అందరూ కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం మాత్రం పూజా హెగ్డే పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకుంది అన్నది తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ సినిమాకు సంబంధించి ఒప్పందాలన్నీ జరిగిపోయాయి. షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అయితే.. అప్పుడు షూటింగ్లో పాల్గొంటానని పూజా హెగ్డే ప్రామిస్ కూడా చేసిందట.

 కానీ ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం లేదని తద్వారా తన డేట్స్ అడ్జస్ట్ కాలేకపోతున్నాయి అని భావించి ఇక ఈ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుందట పూజా హెగ్డే. దీంతో ఇక మేకర్స్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం మరో కథానాయిక కోసం వెతికే పనిలో పడ్డారట. అయితే దర్శకుడు హరీష్ శంకర్  పూజా హెగ్డే ని లక్కీ చార్మ్ గా భావిస్తూ ఉంటాడు. ఇప్పటివరకు దువ్వాడ జగన్నాథం, గద్దలకొండ గణేష్ సినిమాలలో పూజా హెగ్డే ను హీరోయిన్ గా పెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా రిపీట్ చేయాలని భావించిన ఇప్పుడు అది కుదరలేదు అని తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: