అనీల్ రావిపుడికి ఆ ప్లేస్ దక్కినట్టే..!

shami
టాలీవుడ్ లో టాప్ 1 డైరక్టర్ ఎవరు అంటే అందరు చెప్పే పేరు ఒక్కటే అదే దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ 1 నుండి ఈమధ్యనే వచ్చిన ఆర్.ఆర్.ఆర్ వరకు తను ఏ సినిమా తీసిన ఫలితం మాత్రం ఒక్కటే అదే సూపర్ హిట్. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చిన రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లాడు. బాహుబలితో ఆయనకు వచ్చిన క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక టలీవుడ్ లో రాజమౌళి తర్వాత ఇలా ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడిగా లేటెస్ట్ సెన్సేషన్ అనీల్ రావిపుడి ప్లేస్ కొట్టేశాడు.
ఇన్నాళ్లు సెకండ్ ప్లేస్ లో సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ ఉన్నాడు. అయితే ఆచార్య సినిమా డిజాస్టర్ అవడంతో కెరియర్ లో మొదటి ఫ్లాప్ అందుకున్నాడు కొరటాల శివ. ఈ క్రమంలో ఓటమి ఎరుగని దర్శకుల లిస్ట్ నుండి తొలగించబడ్డాడు. ఇక ఇప్పుడు అనీల్ రావిపుడి గురించి చెప్పుకుంటే మొదటి సినిమా పటాస్ నుండి రీసెంట్ గా వచ్చిన ఎఫ్ 3 వరకు అనీల్ రావిపుడి సినిమా అంటే సూపర్ హిట్ పక్కా అన్న టాక్ వచ్చేసింది. తను తీసే ప్రతి సినిమాలో ఆడియెన్స్ ని మెప్పించే అంశాలతో వస్తున్న అనీల్ రావిపుడి రాజమౌళి తర్వాత స్థానం దక్కించుకున్నారని చెప్పొచ్చు.
కెరియర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడిగా రాజమౌలి తన మేనియా కొనసాగిస్తుంటే అదే రూట్ లో అనీల్ రావిపుడి కూడా తన మార్క్ సినిమాలతో సత్తా చాటుతున్నారు. తీసేది యంగ్ హీరో సినిమా అయినా.. స్టార్ హీరో సినిమా అయినా రిజల్ట్ మాత్రం హిట్ పక్కా అనేలా అనీల్ రావిపుడి సినిమాలు వస్తున్నాయి. f3 తర్వాత అనీల్ రావిపుడి బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. అనీల్ హిట్ స్వాగ్ కి బాలయ్య లాంటి మాస్ హీరో సినిమా చేస్తే ఆ సినిమా రిజల్ట్ కూడా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు ఆడియెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: