SVP : OTT రిలీజ్, వసూళ్లు ఎంతంటే?

Purushottham Vinay
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా అనుకున్నదానికంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ ఇప్పట్నించే రిలీజ్ కి ప్లాన్ చేస్తోంది.మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సర్కారు వారి పాట సినిమా బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. విడుదలైన 12 రోజుల్లోనే 2 వందల కోట్ల గ్రాస్ వసూళ్లు దాటేసి ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు సృష్టించింది. మొదటి రోజే ఈ సినిమా 75 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. విడుదలైన 12 రోజులకే ఈ సినిమా 2 వందల కోట్ల క్లబ్‌లో చేరింది. ఓ వైపు థియేటర్లలో కలెక్షన్లు భారీగా వస్తున్నా కూడా ఓటీటీ విడుదల విషయంలో అప్‌డేట్ ఆసక్తి రేపుతోంది.ఇక ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకే దక్కించుకుంది. నిజానికి పెద్ద బడ్జెట్ సినిమాలు థియేటర్ రన్‌టైమ్ తరువాత నెల రోజుల తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయి. కానీ అమెజాన్ ప్రైమ్ మాత్రం అంతకంటే ముందే సర్కారు వారి పాట సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.


ఈ మేరకు ఇప్పటికే సినిమా మేకర్స్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుందని తెలుస్తోంది. అంటే ఈ నెలాఖరున లేదా జూన్ 10 వతేదీన స్ట్రీమింగ్ కానుందని సమాచారం తెలుస్తుంది. నిజానికి ఓటిటిలో జూన్ 24న విడుదల కావల్సి ఉంది.అయితే ఈ విషయమై అటు అమెజాన్ ప్రైమ్ లేదా సినిమా నిర్మాతల నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో అధికారిక ప్రకటన అనేది విడుదల కాలేదు. పరశురామ్ దర్శకత్వం వహించిన సర్కారు వారి పాటలో మహేశ్ బాబు ఇంకా కీర్తి సురేశ్ నటీనటులుగా చేశారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ప్లస్ ఇంకా జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇక వసూళ్ల విషయానికి వస్తే 121 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా 140 కోట్ల షేర్ ఇంకా 201 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఈ ఏడాది టాలీవుడ్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: