అప్పుల ఊబిలో చిక్కుకున్న నాగబాబును కాపాడింది ఎవరంటే..?

Divya
ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు నిర్మాత గా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేశారు కానీ ప్రొడ్యూసర్ గా నిలదొక్కుకోలేకపోవడం గమనార్హం. ఇకపోతే నాగబాబు నిర్మాతగా అప్పుల ఊబిలోకి కూరుకుపోయి . రోడ్డున పడ్డప్పుడు అతని అన్నయ్య కాపాడినట్లు సమాచారం. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే దర్శకుడు భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా 2010 సంవత్సరంలో విడుదలైన చిత్రం ఆరెంజ్. ఈ చిత్రం పాటల పరంగా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ.. కథ పరంగా డిజాస్టర్ గా మిగిలింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా జెనీలియా నటించిన విషయం తెలిసిందే. ఇక పోతే ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగాబ్రదర్ నాగబాబు పూర్తి స్థాయిలో నిర్మాత గా వ్యవహరించగా సంగీత దర్శకుడు హరీష్ జయరాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు.
ఇక పోతే ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పూర్తి స్థాయిలో డిజాస్టర్ గా మిగిలింది. నాగబాబు నిర్మాతగా ముందుకు వెళ్లాలి అని తన ఆస్తులను సైతం అమ్ముకొని మరి ఈ సినిమాపై పెట్టుబడిగా పెట్టాడు. చివరకు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది. దాంతో ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  తన పూర్తి పారితోషకాన్ని కూడా బాబాయ్ నాగబాబు కి తిరిగి ఇచ్చేశారు అని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అయ్యాయి. ఇకపోతే ఇటీవల ఈ విషయంపై స్పందించిన నాగబాబు కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పెంచుకున్నాడు.
ఈ క్రమంలోని ఆరెంజ్ సినిమా డిజాస్టర్ కావడంతో తనకు చాలా నష్టం వచ్చిందని.. దాంతో నడి రోడ్డున పడ్డాడని కానీ ఆ సమయంలో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తన సగం అప్పులను కూడా తీర్చేసారు అని.. అలాగే అబ్బాయి కూడా పారితోషికం వెనక్కు ఇచ్చేసాడు అని చెప్పాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండే నాగబాబు ఇలా ఈ విషయం పంచుకోవడంతో ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: