సునీల్ బాలీవుడ్ ఛాన్స్..!

shami
కమెడియన్ కమ్ హీరో సునీల్ ఇప్పుడు మళ్లీ తన పాత పంథా కొనసాగించాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే వచ్చిన ప్రతి ఛాన్స్ ని వినియోగించుకుంటున్నాడు. హీరో, కమెడియన్ గానే కాదు విలన్ గా కూడా సునీల్ తన సత్తా చాటుతున్నాడు. ఈమధ్య వచ్చిన పుష్ప సినిమాలో సునీల్ విలనిజం బాలీవుడ్ ఆడియెన్స్ ని సైతం ఇంప్రెస్ చేసింది. అందుకే సునీల్ కి సౌత్ లోనే కాదు బీ టౌన్ నుండి ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే సునీల్ మళ్లీ బిజీ అవుతుండగా లేటెస్ట్ గా సునీల్ కి నాన్ తెలుగు మూవీ ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయని తెలుస్తుంది.
అందులో ఒక తమిళ సినిమా ఆఫర్ కాగా మరో రెండు బాలీవుడ్ సినిమాలని తెలుస్తుంది. బాలీవుడ్ లో సునీల్ కి విలన్ గా ఒక క్రేజీ ఆఫర్ వచ్చినట్టు టాక్. అంతేకాదు ఒక సినిమాలో కమెడియన్ గా కూడా సునీల్ ఛాన్స్ దక్కించుకున్నాడట. సునీల్ చేస్తున్న ఈ రెండు సినిమాలు అతనికి బాలీవుడ్ లో మంచి మైలేజ్ తెస్తాయని అంటున్నారు.
విలన్, కమెడియన్ గానే కాదు హీరోగా కూడా సునీల్ తనకు వచ్చిన సినిమాలను చేస్తూ వస్తున్నాడు. సునీల్ చేస్తున్న ఈ ప్రయత్నాలన్ని మళ్లీ తిరిగి అతన్ని కెరియర్ లో బిజీ అయ్యేలా చేస్తున్నాయి. కొన్నాళ్లు కెరియర్ డైలమా అనిపించిన సునీల్ ఇప్పుడు మళ్లీ ఫాం లోకి వచ్చాడని చెప్పొచ్చు. బాలీవుడ్ లో సునీల్ చేస్తున్న ప్రాజెక్ట్ కనుక క్లిక్ అయితే సునీల్ అక్కడ పర్మినెంట్ గా వరుస అవకాశాలు తెచ్చుకునే ఛాన్స్ ఉంది. పుష్ప వల్ల బాలీవుడ్ ఆడియెన్స్ తనలోని నెగటివిటీని ఇష్టపడ్డారని తెలిసి ఆ విషయంలో సుకుమార్, అల్లు అర్జున్ లకు తన స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు సునీల్. మళ్లీ తన కెరియర్ ని ట్రాక్ ఎక్కించాలని అనుకుంటున్న సునీల్ వరుస సినిమాలతో తన సత్తా చాటాలని చూస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: