సమంత ఒంటరిగా చనిపోవాలి.. నెటిజన్ షాకింగ్ కామెంట్?

praveen
దశాబ్ద కాలం గడిచి పోయినా.. ఎంతో మంది హీరోయిన్లు వచ్చినా ఇప్పటికీ కూడా టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది సమంత. పెళ్లి చేసుకున్న తర్వాత సమంత కేరీర్ ముగిసి పోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ వరుస సినిమాల హిట్లతో అవకాశాలు అందుకుంటూ వచ్చింది సమంత. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంతా కెరీర్ ముగిసినట్లే అని భావించారు. కానీ సమంత మాత్రం ఎగసిపడిన అలలా అన్ని ఆటుపోట్లను తట్టుకుని తన క్రేజ్ అంతకంతకూ పెంచుకుంటుంది అని చెప్పాలి. నాగచైతన్యతో విడాకుల తర్వాత కాస్త ఖాళీ లేకుండా బిజీ బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.

 ఇప్పటికే వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా సరైన అవకాశాలు అందుకుంటూ ఉండడం గమనార్హం. ఇక మరోవైపు కాస్త ఖాళీ సమయం దొరికితే  జిమ్ లో కసరత్తులు చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరిలో ప్రేరణ నింపుతూ ఉంది. ఇంకోవైపు ఇక తన పెంపుడు జంతువులతో సమయం గడపడానికి ఇష్టపడుతుంది సమంత.  ఇలా ఖాళీ సమయంలో ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది.

 ఇకపోతే సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో దాదాపు అందరికీ తెలుసు.. సినిమాలకు సంబంధించిన అప్డేట్లను మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన అప్డేట్స్ ను కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే ఇటీవల సమంత తన కుక్కల తో ఉన్న క్యూట్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపైన ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఆమె పిల్లులు కుక్కలతో ఒంటరిగా చనిపోవాలి అంటూ కామెంట్ చేయగా.. దీనిపై స్పందించిన సమంత అలా జరిగితే నా అదృష్టంగా భావిస్తాను అంటూ రిప్లై ఇవ్వడం మరింత హాట్ టాపిక్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: