స్టార్ హీరోలను కూడ లెక్క చేయని బిత్రి సత్తి !

Seetha Sailaja
సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ ను చూసేవారికి బిత్రి సత్తి పేరు ఎరగని వారుండరు. అమాయకంగా మొహం పెట్టుకుని తెలంగాణ భాషలో అమాయకంగా మాట్లాడే అతడి భాష చాలామందిని ఆకర్షిస్తుంది. ఈ క్రేజ్ తోనే అనేక ప్రముఖ ఛానల్స్ అతడితో స్పెషల్ కార్యక్రమాలను డిజైన్ చేయిస్తున్నారు. ఆ కార్యక్రమాలకు కూడ మంచి రేటింగ్స్ వస్తూ ఉండటంతో ఇతడు అనేక ప్రముఖ ఛానల్స్ లో కూడ కనిపిస్తున్నాడు.

లేటెస్ట్ గా ఇతడు లేకుండా టాప్ హీరోల సినిమాల ప్రమోషన్ పూర్తి కావడం లేదు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రమోషన్ లో అదేవిధంగా ‘ఆచార్య’ ‘సర్కారు వారి పాట’ మూవీ ప్రమోషన్ లో టాప్ సెలెబ్రెటీలను తుంటరి ప్రశ్నలు అడిగి వారిని ఇరుకున పెట్టడానికి తన హాస్య చతురతతో అనేక ప్రశ్నలు వేసి ఆ కార్యక్రమాన్ని చూసేవారికి నవ్వు తెప్పించాడు.

ఇప్పుడు లేటెస్ట్ గా ఇతడు ‘ఎఫ్ 3’ ప్రమోషన్ లో కూడ అందర్నీ ఒక ఆట పట్టిస్తున్నాడు. ముఖ్యంగా వెంకటేష్ లాంటి టాప్ హీరోలు కూడ ఇతడు వేసే తుంటరి ప్రశ్నలకు చాల కష్టపడి సమాధానం చెప్పవలసి వచ్చింది. అయితే ఇలాంటి ప్రమోషన్ కార్యక్రమాలలో ఇంటర్వ్యూలు చేయడానికి బిత్రి సత్తి లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నాడట.

అంతేకాదు ఇండస్ట్రీలోని టాప్ సెలెబ్రెటీలు అడిగినా మొహమాటం లేకుండా లక్షలు వసూలు చేస్తున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది. గతంలో యాంకర్ సుమ చేత ఇలాంటి ఇంటర్వ్యూలు చేయించేవారు. అయితే ఆమె యాంకరింగ్ రొటీన్ గా మారిపోయింది అని విమర్శలు వస్తున్న పరిస్థితులలో బిత్రి సత్తికి కలిసొచ్చే కాలం వచ్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే మరికొంత కాలం కొనసాగితే ఇతడు కూడ సుమ లానే బాగా ఎదిగి పోతాడు అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: