'హర హర వీరమల్లు' మూవీ విషయంలో ఆ పుకార్లను అస్సలు నమ్మొద్దు..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.

 ఆ తర్వాత మళ్లీ వఖిల్ సబ్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.  ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాతో మరో విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా , ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. 50 శాతం వరకు షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తిరిగి కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది.  

తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే హరిహర వీరమల్లు సినిమాపై ఈ మధ్య అనేక రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఈ సినిమా అత్యధిక బడ్జెట్ కావడం వల్ల ఆగిపోయింది అని , కొత్త షెడ్యూల్ ప్రారంభం కావడానికి కాస్త టైమ్ పడుతుంది అని.  అలాగే ఈ సినిమా అవుట్ పుట్ బాగా లేకపోవడంతో రీ షూట్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది అని,  ఇలా అనేక కథనాలు బయటకు వచ్చాయి. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ కథనాలు అవాస్తవం అని తెలుస్తోంది. హరిహర వీరమల్లు మూవీ తదుపరి షెడ్యూల్ జూన్ 7 వ తేదీన ప్రారంభం అయ్యి జూన్ 27 వ తేదీ వరకు కొనసాగనున్న ట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సభ్యులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: