నువ్వుఆల్రెడీ సరి అయిపోయావ్.. నాగ చైతన్యకు రానా సర్ ప్రైజ్..!

shami
దగ్గుబాటి రానా, అక్కినేని నాగ చైతన్యల మధ్య రిలేషన్ ఏంటన్నది అందరికి తెలిసిందే. ఇద్దరు కూడా తమ మార్క్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య థ్యాంక్ యు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. సినిమా టీజర్ లో చివరగా నన్ను నేను సరిచేసుకోవడానికి.. నేను చేస్తున్న ప్రయత్నమే థ్యాంక్ యు అని టీజర్ లింక్ పెట్టాడు నాగ చైతన్య. అయితే దీనికి రిప్లై గా రానా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు.
ఇంతకీ రానా ఏమని కామెంట్ పెట్టాడు అంటే నువ్వు ఆల్రెడీ సరి అయిపోయావ్ బ్రదర్ సూపర్ టీజర్ గయ్ గుడ్ లక్ అని పెట్టాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ దగ్గుబాటి, అక్కినేని ఫ్యాన్స్ ని అలరిస్తుంది. సమంతతో డైవర్స్ తీసుకున్న తర్వాత నాగ చైతన్య నుండి ఇలాంటి డైలాగ్ అది సినిమాలోనే అయినా తన పర్సనల్ లైఫ్ కి దగ్గరగా ఉండేలా చెప్పడంతో అందరు దానికి కనెక్ట్ అయ్యారు. నన్ను నేను మార్చుకోవడంలో చేస్తున్న ప్రయత్నం అనగానే సమంత నుండి తను విడిపోయాక తనని తాను మార్చుకుంటున్నాడని అనుకుంటున్నారు.
ఏది ఏమైనా మనం కాంబినేషన్ లో వస్తున్న ఈ థ్యాంక్ యు మూవీ తపకుండా అభిమానుల అంచనాలకు తగినట్టుగానే ఉండేలా ఉంది. సినిమాలో చైతన్య సూపర్ స్టార్ మహేష్ అభిమానిగా కనిపిస్తున్నారు. సినిమాలో 3 వేరియేషన్స్ ఉన్న పాత్రలో చైతు తన సత్తా చాటనున్నారు. తప్పకుండా నాగ చైతన్య ఈ థ్యాంక్ యు సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. విక్రం కె కుమార్ డైరక్షన్ లో థ్యాంక్ యుతో పాటుగా దూర అనే వెబ్ సీరీస్ కూడా చేస్తున్నాడు నాగ చైతన్య. ఈ మూవీ తర్వాత సర్కారు వారి పాట డైరక్టర్ పరశురాం తో నాగ చైతన్య సినిమా ఉంటుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: