ఖుషి నడుము సీన్.. చిరు చేస్తే ఎలా ఉంటుంది..?

shami
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాల్లో ఖుషి ఒకటి. ఆ సినిమాలో నడుము సీన్ అయితే ఎప్పటికీ ఫ్యాన్స్ కి ఫేవరెట్ సీన్ అని చెప్పొచ్చు. పవర్ స్టార్ మార్క్ మూవీగా వచ్చిన ఆ సినిమా ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ అందించింది. ఆ సినిమాలోని కొన్ని సీన్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో రీ క్రియేట్ చేశారు. ముఖ్యంగా నడుము సీన్ అయితే చాలా సినిమాల్లో ట్రై చేశారు. ఇక ఇప్పుడు ఆ సీన్ ని ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలో పెడుతున్నట్టు టాక్.
మెగాస్టార్ చిరంజీవి, మెహెర్ రమేష్ కాంబినేషన్ లో వస్తున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీఎవి పవన్ అభిమానిగా కనిపిస్తారట. అంతేకాదు సినిమాలో ఖుషి నడుము సీన్ కూడా చిరు చేత చేయిస్తున్నారట. చిరంజీవిని పవన్ అభిమానిగా చూపించడం పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. అదీగాక ఖుషి సీన్ చేయించడం అంటే మాములు విషయం కాదు. ఏమాత్రం తేడా వచ్చినా సరే ఫ్యాన్స్ అప్సెట్ అవుతారు. చిరుతో పాటుగా ఈ నడుము సీన్ లో శ్రీముఖి స్క్రీన్ షేర్ చేసుకుంటుందని తెలుస్తుంది.
వేదాళం రీమేక్ గా వస్తున్న భోళా శంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా చిరుకి సిస్టర్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. మాత్రుక సినిమా వేదాళం ని పూర్తిగా మార్చేసి చిరు ఇమేజ్ కి, స్టైల్ కి తగినట్టుగా రీమేక్ చేస్తున్నారత మెహెర్ రమేష్. ఆచార్య నిరాశపరచడంతో తను చేస్తున్న సినిమాల మీద మరింత ఫోకస్ పెట్టారు చిరంజీవి. భోళా శంకర్ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా చిరంజీవి గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య సినిమాలు చేస్తున్నారు.
మళయాళ సూపర్ హిట్ మూవీ బ్రో డాడీ సినిమా రీమేక్ లో కూడా చిరు నటిస్తారని టాక్. ఆ సినిమాలో మరో యువ హీరో కూడా నటించే ఛాన్స్ ఉంది. మరి చిరుతో స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ యంగ్ హీరో ఎవరన్నది ఇంకా ఫైనల్ అవలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: