అల్లు అర్జున్ ఎందుకు ఇలా చేస్తున్నాడు..?

Divya
అల్లు అర్జున్ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప సినిమా వరకు స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న బన్నీ ఆ తర్వాత పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయారు. బన్నీ నటించిన మొదటి పాన్ ఇండియా చిత్రం మూవీ గా వచ్చిన పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప పార్ట్-2 కు సంబంధించి సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను కూడా మొదలు పెట్టనున్నారు చిత్రబృందం.

ఇక ఈ చిత్రం అయి పోకముందే వకీల్ సాబ్  సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో మరొక చిత్రాన్ని తీయబోతున్నట్లు ఖరారు చేశారు ఈ చిత్రానికి"ఐకాన్" అనే టైటిల్ ను కూడా సెట్ చేశారు. కానీ ఈ చిత్రం వాయిదా పడుతూనే వస్తోంది. ఇక ఈ గ్యాప్ లోనే అల్లు అర్జున్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రం కూడా గతంలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ కూడా లేదు.
పుష్ప చిత్రం తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేయబోతున్నారనే విషయం అభిమానులలో ఆసక్తికరంగా ఉన్నది. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ మురుగదాస్ తో కూడా అల్లు అర్జున్ ఒక సినిమా ఉండబోతోంది అనే టాక్ వినిపిస్తోంది. ఇటీవలె మురుగదాస్ సూపర్ స్టార్ తో కలిసి దర్బార్ సినిమాని తెరకెక్కించారు. ఇక సూర్య నటించిన గజిని-2 సినిమాని కూడా త్వరలోనే తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్త కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్తో మురుగదాస్ సినిమా చేయబోతున్నాడనే తగ్గట్టుగా వినిపించడంతో మరి ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని విషయం తెలియలేదు. మరి అల్లు అర్జున్ అన్ని చిత్రాలను తన గుప్పెట్లో పెట్టుకుని ఈ చిత్రాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియజేయడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: