ఎన్టీఆర్ 30 లో ఇది ఒకసారి గమనించారా?

Satvika
ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి పాన్ ఇండియా స్టార్ గా మంచి పేరును అందుకున్నాడు. నందమూరి హీరో ఎన్టీఆర్..ఆ సినిమా తో ఎన్టీఆర్ లైఫ్ పూర్తిగా టర్న్ అయ్యింది.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కూడా అంతకు మించి ఘన విజయాన్ని అందుకున్నాడు.. ఇప్పుడు సినిమాల స్పీడ్ ను కూడా పెంచాడు. ఆ సినిమా అవ్వగానే ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు.తాజాగా ఆయన పుట్టిన రోజు కానుకగా తాను చేస్తున్న రెండు సినిమాల అప్డేట్ ను ఫ్యాన్స్ కు అందించారు.


కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌లతో చేయబోతున్నట్లు క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కూడా అదరిపోయే రేంజ్‌లో ఉండటంతో ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని వారు అప్పుడే ఎదురుచూస్తున్నారు.తారక్, తన 30వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌ లో తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి మెయిన్ ప్లాట్ ఏమిటో తెలియజేస్తూ ఓ వీడియో గ్లింప్స్‌ను వదిలారు చిత్ర యూనిట్. ఈ వీడియోలో తారక్ బేస్ వాయిస్‌తో చెప్పిన డైలాగ్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చాయని చెప్పాలి.


పవర్‌ఫుల్ కథతో ఈ సినిమా రాబోతుందనే విషయం అయితే స్సష్టం అయ్యింది. అయితే ఈ వీడియో గ్లింప్స్‌లో దర్శకుడు కొరటాల శివతో పాటు మరికొందరి పేర్లు కూడా కనిపించాయి.ఈ సినిమాలో నటిస్తున్న, సినిమా కోసం పని చేస్తున్న అందరి పేర్లు కనిపించాయి. కానీ ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ పేరు మాత్రం కనిపించలేదు.అలియా తప్పుకోవడం తో ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశం చాలా ఆసక్తికరంగా మారింది. మరి ఎన్టీఆర్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసే ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి చిత్ర వర్గాలు..మరి డైరెక్టర్ ఏ బ్యూటీని దించుతాడో చూడాలి..





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: