'సర్కారు వారి పాట' మూవీ రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురామ్ దర్శకత్వంలో తమన్ సంగీత సారధ్యంలో  తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా మే 12 వ తేదీన గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదలైన విషయం మన అందరికీ తెలిసిందే.  మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న సర్కారు వారి పాట మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబడుతోంది.  ఇప్పటి వరకు రెండు రోజుల బాక్సాఫీస్ రన్ ని పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధించిందో తెలుసుకుందాం.


నైజాం : 17.10 కోట్లు
సీడెడ్ : 5.96 కోట్లు
యూ ఎ : 5.39 కోట్లు
ఈస్ట్ : 4.33 కోట్లు
వెస్ట్ : 3.19 కోట్లు
గుంటూర్ : 6.34 కోట్లు
కృష్ణ : 2.83 కోట్లు
నెల్లూర్ : 1.91 కోట్లు
రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కి గాను సర్కారు వారి పాట సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 47.05 కోట్ల షేర్ కలెక్షన్ లను  బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయగా ,  66.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.

 
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో సర్కారు వారి పాట మూవీ 3.35 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఓవర్సిస్ లో సర్కారు వారి పాట మూవీ : 7.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కి గాను  సర్కారు వారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా 58.21 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్  దగ్గర వసూలు చేయగా, 90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: