భర్త పుట్టిన రోజున శుభవార్త తెలిపిన ప్రణీత...?
తన భర్త తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ వారు త్వరలోనే తల్లితండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు తన ప్రగ్నేసి కన్ఫర్మ్ అయిన కిట్స్ ను అలాగే స్కానింగ్ రిపోర్ట్ పీక్స్ ను కూడా షేర్ చేశారు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినప్పటికీ.. ప్రణీతకు తన ప్రతిభకు తగ్గ గుర్తింపు రావాల్సిన స్ధాయిలో రాలేదు అనే చెప్పాలి.
తన అభిమానులు అంతా ఆమె స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుందని భావించారు కానీ ఆశించిన స్థాయిలో గుర్తిపు అందుకోలేక పోయారు ప్రణీత. అయితే అభిమానుల్ని మాత్రం బాగానే సంపాదించుకుంది ఈ బాపు బొమ్మ. నిజానికి వరుస అవకాశాలు బాగానే అందాయి కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం దక్కలేదు. ఇటు టాలీవుడ్లోనే కాకుండా తమిళ, కన్నడ చిత్రాలలో కూడా ప్రణీత నటించి తన ప్రతిభను చాటుకున్నారు. ఆ తరువాత ప్రియుడు నితిన్ రాజు అనే వ్యాపారవేత్తని లాక్ డౌన్ సమయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగ ఇప్పుడు ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్లు తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదిక వ్యక్తపరిచారు.