తన రీ ఎంట్రీ లో రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకులను ఆకర్షించడానికి రాబోతున్నాడు. వకీల్ సాబ్ అలాగే భీమ్లా నాయక్ సినిమాలు రెండూ కూడా రీమేక్ సినిమాలే అయినా ప్రేక్షకులను ఇది భారీ స్థాయిలో మెప్పించాయి అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన చేస్తున్న చారిత్రాత్మక సినిమా పైనే అందరి కళ్ళు ఉన్నాయి. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీర మల్లు సినిమా చేస్తుండగా ఏప్రిల్ 6 తేదీ నుంచి కొత్త షెడ్యూల్ మొదలు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాను పూర్తి చేసే విధంగా దర్శకుడు క్రిష్ ప్లాన్ చేశాడు. కొంతకాలంగా పవన్ డేట్స్ లేని కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడు తూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఈ సినిమా కోసం పవన్ ఐదు నెలల సమయాన్ని కేటాయించడం విశేషం. 17వ శతాబ్దంలో మొగలుల కాలంలో జరుగుతున్న ఈ సినిమా కోసం హైదరాబాద్ లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీ భారీ సెట్ ను ఏర్పాటు చేశారు. ఈ సెట్లోనే కీలక ఘట్టాలను చిత్రీకరించబోతున్నారు.
మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ఇదే ఎంతో ఆసక్తికరమైన సినిమాగా ఉంది. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడం మరింత ఆసక్తి నెలకొనడానికి కారణం. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఏ విధమైన ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. అంతేకాదు ఈ సినిమా ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయిందని కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధించాల్సిన అవసరం ఉంది. నిధి అగర్వాల్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం సమకూరుస్తున్నగా ఈ చిత్రం ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.