తాజాగా శృతిహాసన్ కి మరియు తన ప్రియుడికి పెళ్లైయిపోయిందంటూ ప్రియుడు చెప్పిన విషయం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఇప్పుడు ఎక్కడ చూసిన వీరిద్దరు జోడీగా కనిపిస్తున్నారు. అయితే తాను ప్రేమలో పడ్డాననే విషయాన్ని శృతి కూడా పరోక్షంగా ఒప్పుకుంది.ఇక ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారట. అయితే ఈ విషయాన్ని ప్రియుడు శాంతను హజారికా చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాదు క్రియేటివ్‌గా తమ మ్యారేజ్ అయిపోయిందంటూ ఆయన ట్విస్ట్ ఇచ్చారు.ఇకపోతే డూడుల్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న శాంతను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శృతి హాసన్‌తో తమ రిలేషన్‌పై ఓపెన్ అయ్యాడు.కాగా క్రియేటివ్‌గా మా(శృతి,శాంతను) పెళ్లి జరిగిపోయింది....ఇకపోతే అందుకు ఓ నిదర్శనం మా బలమైన బంధం.
దీనితో పాటు మేమిద్దరం క్రియేటివ్ పీపుల్. ....అంతేకాదు ఇద్దరం కలిసి కొత్త కొత్త విషయాలను క్రియేట్ చేయాలనుకుంటాం. ఇక నా జీవితంలో శృతి ఎంతో స్ఫూర్తిని నింపింది. .... శృతి నన్ను చూసి తను ఇన్‌స్పైర్ అవుతుంటుంది...ఇకపోతే మా క్రియేటివ్ థాట్స్ కూడా ఒకేలా ఉంటాయి. ...కాగా మా ప్రత్యక్ష వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలియదు` అని తెలిపారు.ఇకపోతే తమ ఆలోచనల ప్రకారం తమ మ్యారేజ్ ఇప్పటికే జరిగిపోయిందనే కోణంలో శాంతను ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఆయన చెప్పినదాని ప్రకారం వీరిద్దరు మ్యారేజ్ చేసుకునే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది.వీరి బంధం నిజంగానే పెళ్లి వరకు వెళ్తుందా? లేదా ఏదైనా ట్విస్ట్ చోటు చేసుకుంటుందా? అనేది చూడాలి మరి.
అయితే వీరిద్దరు మాత్రం ఇప్పుడు చెట్టాపట్టాలేసుకుని షికార్ కెళ్తున్నారు. అంతేకాదు అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటె ఆమె నటిగానే కాదు, మ్యూజిషీయన్‌గా, సింగర్‌గా రాణిస్తుంది. అంతేకాదు క్రియేటివ్ సైడ్ తనలోని కొత్త యాంగిల్స్ ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది.ఇకపోతే ఆ మధ్య హీరోయిన్‌గా సినిమాలు మానేసి, సంగీతంపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పలు మ్యూజిక్ షోలు కూడా నిర్వహించారు.కాగా ఇప్పుడు తాజాగా చిరంజీవితో `మెగా 154`లో, మరియు బాలకృష్ణతో `ఎన్బీకే 107`లో, ప్రభాస్‌తో `సలార్`లో హీరోయిన్‌గా నటిస్తుంది. అంతేకాదు ఈమె ఈ చిత్రాల కోసం పారితోషికం కూడా భారీగానే అందుకుంటోందట.