నిహారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ నేనే డిలీట్ చేశా : నాగబాబు
అంతలోనే ఇక నిహారిక తండ్రి నాగబాబు ఇక ఈ మెగా డాటర్ కి పెళ్లి ఏర్పాట్లు చేశారు. తన ఫ్యామిలీకి చాలాకాలంగా తెలిసిన పోలీస్ అధికారి ప్రభాకర్ రావు కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్య కి ఇచ్చి వివాహం చేశారు. నిహారిక వివాహం 2020 డిసెంబర్ 9వ తేదీన జరిగింది. ఇకపోతే ఇక పెళ్లి తర్వాత నటిగా కాకుండా నిర్మాతగా కెరీర్ మొదలు పెట్టింది నిహారిక. అయితే మెగా డాటర్ అన్న తర్వాత ఇక నిహారిక కి సోషల్ మీడియాలో క్రేజు ఉండకుండా ఉంటుందా. ఈమెకు ఇంస్టాగ్రామ్ లో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఉన్నఫలంగా నిహారిక తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ క్లోజ్ చేసింది.
అయితే ఇటీవల ఇదే విషయం గురించి సోషల్ మీడియా వేదికగా ఒక అభిమాని నాగబాబును ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పారు ఆయన. నిహారిక అకౌంట్ ని డిలీట్ చేసింది నేనే.. కోడింగ్ నేర్చుకొని మరి ఆమె అకౌంట్ డి యాక్టివేట్ చేశాను. మళ్లీ డీకోడింగ్ నేర్చుకొని యాక్టివేట్ చేస్తాను అంటూ నాగబాబు ఫన్నీగా సమాధానం చెప్పారు. అయితే నిహారిక తన ఇంస్టాగ్రామ్ ఖాతా డిలీట్ చేయడంతో ఇక చైతన్యతో ఆమె వైవాహిక జీవితం ఎలా ఉంది అన్న విషయంపై ఎన్నో రూమర్లు కూడా వచ్చాయి. రూమర్స్ కి చెక్ పెడుతూ చైతన్య ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేశాడు.