ప్రేమలో పడ్డ శ్రీముఖి..?

Anilkumar
బుల్లితెర టెలివిజన్ రంగంలో స్టార్ యాంకర్ గా శ్రీముఖి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు పటాస్ అనే కామెడీ షో తో యాంకర్ గా భారీ క్రేజ్ ను సంపాదించుకున్న శ్రీముఖి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించింది. కానీ శ్రీముఖి మాత్రం తన కెరీర్ ను తన స్థాయికి తగ్గట్టు ప్లాన్ చేసుకోలేదు. అయితే శ్రీముఖి మాత్రం బంగారం కురిసే సినీ తెరను వదిలేసి, చిల్లర రాలుతున్న బుల్లితెరకే ఇన్నాళ్లు పరిమితం అయిపోయింది. ఇక  అసలు విషయంలోకి వెళితే తాజాగా శ్రీముఖి వాలంటైన్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ పిక్‌ ను తన ఫ్యాన్స్ తో పంచుకుంది. 


కాగా వాలంటైన్స్‌ డే రోజున సోషల్ మీడియాలో శ్రీముఖి గులాబీ పూలతో దిగిన ఒక ఫోటోను పోస్ట్ చేసింది ఈమె. అంతేకాకుండా తన ఇన్‌ స్టాగ్రామ్ ఖాతాలో 'ఫిబ్రవరి 14, 2022.. ఇది గుర్తు పెట్టుకోండి...మనం  మళ్లీ మాట్లాడుకుందాం.అంటూ జీవితంలోనే బెస్ట్ వాలంటైన్ ఇది' అని చిన్న మెసేజ్ కూడా పెట్టింది.అయితే ఈ మెసేజ్ ను అర్ధం చేసుకుంటే.. శ్రీముఖి కూడా ప్రేమలో పడింది అని అనిపిస్తుంది. అంతేకాకుండా గతంలో శ్రీముఖి ఓ షోలో పాల్గొని అందరూ చూస్తుండగానే యాంకర్‌ ప్రదీప్‌ కు ఐ లవ్ యూ అంటూ సిగ్గు లేకుండా డైరెక్ట్ గా ప్రపోజ్‌ చేసింది.అయితే శ్రీముఖి ఇది జస్ట్ జోక్ చేసిందా ? లేక నిజంగానే శ్రీముఖి తన మనసులోని మాటని ఇలా పబ్లిక్ ముందు కక్కేసిందా ? అనేది చూడాలి మరి.


ఇక  అప్పుడు విచిత్రంగా శ్రీముఖి ప్రపోజల్ కి ప్రదీప్‌ కూడా సరే అన్నట్లుగా తెగ సిగ్గు పడిపోయాడు.అయితే వీరి మధ్య అప్పటి నుంచి ప్రేమ నడుస్తోంది అన్నట్టు రూమర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఒకవేళ ఇవి పుకార్లు అయితే శ్రీముఖి వీధి కి ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందో చూడాలి.టీవీ షో ఏదైనా ఎప్పుడూ హాట్ హాట్ గా కనిపించడానికి అప్పుడు ప్రయత్నం చేస్తుంది శ్రీముఖికి . అంతేకాకుండా శ్రీముఖి కి డిజిటల్ మీడియాలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఇక ఈమె ఎప్పటికప్పుడు తన కొత్త లుక్స్ తో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: