వామ్మో : షాకింగ్ ధరకి అమ్ముడైన రామ్ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ .... ??

GVK Writings
యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న యాక్షన్ కమర్షియల్ మూవీ ది వారియర్. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. అంతకముందు పూరి జగన్నాథ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్, అలానే గతేడాది కిశోర్ తిరుమల దర్సకత్వంలో చేసిన రెడ్ మూవీ చేసిన రామ్, ఆ సినిమాలతో మంచి సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. దానితో ప్రస్తుతం చేసిన ది వారియర్ మూవీ పై అందరిలో మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి.
ద్విభాషా మూవీగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి తీస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా ఒక పాత్ర పోలీస్ అధికారి పాత్రని ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని బట్టి చూస్తే మనకి అర్ధం అవుతుంది. అయితే అసలు విషయం ఏంటంటే, ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ఏకంగా రూ.16 కోట్లకు అమ్ముడయ్యాయనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం.
గతంలో రామ్ నటించిన పలు సినిమాలు యూట్యూబ్ లో హిందీలో డబ్ కాబడి మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. దానితో అక్కడ రామ్ కి మంచి పేరు దక్కింది. దానితో ఈ మూవీ డబ్బింగ్ రైట్స్ కి ఇంత భారీ ధర పలికిందని అంటున్నారు విశ్లేషకులు. అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు లింగు స్వామి ఈ సినిమాని ఎంతో బాగా తీస్తున్నారని, తప్పకుండా మరొక రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ది వారియర్ సినిమా సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: