పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్న వరలక్ష్మి శరత్ కుమార్..!

Pulgam Srinivas
కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మి శరత్ కుమార్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది,  మొదట్లో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ పాత్రలు పెద్దగా దక్కకపోవడంతో ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ ప్రతినాయక పాత్రలతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించింది.  అయితే అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ అనేక సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది,  ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ మూవీ ద్వారా తెలుగులో కూడా ఆమె విలన్ గానే ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్,  రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాలో  కూడా విలన్ పాత్రలో కనిపించింది, ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ మాత్రమే కాకుండా ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమాలో చేసిన పాత్రను విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.

 దానితో వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో కూడా బిజీ అయ్యింది, ప్రస్తుతం తెలుగులో వరలక్ష్మి శరత్ కుమార్,  బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో  కూడా ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. ఇది ఇలా ఉంటే మైఖేల్  సినిమాలో కూడా వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ రోల్ కు సమానమైన పాత్ర చేస్తుందట, గౌతమ్ మీనన్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీలో సందీప్ కిషన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు చేస్తున్నారు, రంజిత్ జయ కోడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మజిలీ' ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ కథానాయికగా అలరించనుంది.  తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ మూవీ ని విడుదల చేయనున్నారు, ఇలా వరలక్ష్మి శరత్ కుమార్ పాన్ ఇండియా సినిమాలో ప్రధాన పాత్రలో నటించబోతోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: