బంగార్రాజు తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన నాగార్జున..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బంగార్రాజు, ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటించాడు, అలాగే ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది, మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగివున్న ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది, ఈ సినిమా విడుదల అయిన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతుంది, ప్రస్తుతం బంగార్రాజు సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ లను కూడా బాగానే రాబడుతోంది, ఇది ఇలా ఉంటే బంగార్రాజు సినిమాతో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.

  అయితే బంగార్రాజు సినిమా కంటే ముందు మాత్రం నాగార్జున బాక్స్ ఆఫీస్ దగ్గర వరస పరాజయాలతో డీలా పడిపోయాడు,  నాగార్జున, ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజు గారి గది త్రీ  సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయాన్ని ఎదుర్కొన్నాడు, అలాగే మన్మధుడు టు సినిమాతో కూడా నాగార్జున బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ ను అందుకోలేక పోయాడు,  అలాగే వైల్డ్ డాగ్ సినిమా కూడా నాగార్జున కు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది.  ఇలా వరుస పరాజయాలతో డీలా పడిపోయిన నాగార్జున కు బంగార్రాజు సినిమా ఫుల్ జోష్ ను తీసుకు వచ్చింది. ఇది ఇలా ఉంటే బంగార్రాజు సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. ఇది ఇలా ఉంటే  నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: