అప్పుడు యాంకర్ లు.. ఇప్పుడు హీరోయిన్ లు!!

P.Nishanth Kumar
సినిమా పరిశ్రమలోకి ఎలా వచ్చాము అన్నది ముఖ్యం కాదు ఏ విధంగా ఎదిగాము అన్నది ముఖ్యం అన్నట్లుగా కొంతమంది హీరోయిన్ లు తమ టాలెంట్ ను ఉపయోగించుకొని ఇప్పుడు స్టార్లుగా రాణిస్తున్నారు.  మొదట బుల్లితెరపై యాంకర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ తర్వాత హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ నిలిచిపోయారు కొంతమంది. అలా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు యాంకర్స్ గా వచ్చి ఆ తరువాత అదృష్టం కొద్దీ హీరోయిన్స్ అయ్యి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని స్టార్ గా ఎదిగిన నటీమణుల గురించి ఇప్పుడు చూద్దాం. 

యాంకర్ గా ఇప్పుడు అగ్ర స్థానాన్ని అందుకుని టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది సుమ. ఆమె కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఈమె మధ్యలో కొన్ని సినిమాలు చేసి చివరకు యాంకర్ గానే కొనసాగుతోంది. ఇక యాంకర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టి స్టార్ నటిగా వెలుగొందుతోంది అనసూయ. ఆమె ప్రస్తుతం మంచి మంచి పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రష్మీ కూడా మొదట్లో కొన్ని చిత్రాలతో ఆలరించిన కూడా పెద్దగా పేరు రాలేదు ఆమెకు.

ఎప్పుడైతే యాంకర్ గా అడుగు పెట్టిందో అప్పుడు మంచి క్రేజ్ అందుకని ఆ తర్వాత సినిమాల్లో నటించడం మొదలు పెట్టి స్టార్ నటిగా స్థిరపడిపోయింది. రెజీనా కూడా మొదట్లో యాంకర్ గా పలు షోలు చేసి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.  ఇక కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆమె ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే ప్రముఖ షో కి యాంకర్ గా చేసి మంచి గుర్తింపు దక్కించుకొని ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాలు చేసి హీరోయిన్ గా స్థిరపడిపోయింది. ఇప్పటికీ ఆమెకు సినిమా అవకాశాలు రావడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: