ధనుష్ - ఐశ్వర్య విడాకుల ప్రభావం సినిమాపై పడనుందా..!!

N.ANJI
సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి తెలియని వారంటూ ఉండరు.ఆయన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక్క హీరోలాగే కాకుండా సింగర్, ప్రొడ్యూసర్, దర్శకుడిగా పలు వాటిలో తన సత్తా చాటుకున్నాడు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి సూపర్ స్టార్ తనయురాలు ఐశ్వర్యతో వివాహం జరిగిన విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరూ ఎంతో అన్యోన్యగా వారి వివాహ బంధాన్ని కొనసాగిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచారు. అయితే వీరిద్దరూ తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి శుభం కార్డు వేశాడు. ఇక వీరిద్దరూ విడిపోతున్నట్లు ధనుష్, ఐశ్వర్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
అయితే ధనుష్, ఐశ్వర్యల వివాహం 2004లో జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సూపర్ స్టార్ అల్లుడిగా కాకుండా ధనుష్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా మంచి పేరు, గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ధనుష్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. ఎం జరిగిందో తెలీదు కానీ ధనుష్, ఐశ్వర్య వారు విడాకులు తీసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో తెలిపారు..
వారిద్దరూ తమ సోషల్ మీడియాలో ఇన్నేళ్లు అన్నివిధాలుగా కలిసి ఉన్నాం ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకోవాలని అనుకున్నామని ధనుష్, ఐశ్వర్య తెలిపారు. అయితే ఈ స్టార్ కపుల్ విడిపోవడానికి కారణం ఏంటో ఇంకా తెలియలేదు. కోలీవుడ్ లో స్టార్ హీరో ధనుష్ తన నటనతో నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఆయన కేవలం తమిళంలోనే కాదు హిందీలో కూడా ఆయన సినిమాలో కూడా నటించారు. ఇటీవల కాలంలో గా ధనుష్ తెలుగులో సార్ సినిమాను స్టార్ట్ చేశారు. ఇక ధనుష్, ఐశ్వర్య విడాకుల ప్రకటన లేటెస్ట్ గా చేసినా వీరి మధ్య ఈ ఆలోచన ఎప్పటి నుండో ఉందని కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఎంతటి స్టార్ అయ్యినప్పటికీ విడాకుల ప్రభావం ధనుష్ సినిమాలపై పడుతుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: