అఖండ సెన్సేషనల్ రికార్డ్..

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో పైగా ప్రస్తుతం వున్న పరిస్థితిలో హిట్ టాక్ వచ్చిన సినిమాలు థియేటర్లలో రెండు వారాలు ప్రదర్శితం కావడం చాలా కష్టమవుతోంది. పెద్ద సినిమాల నిర్మాతలు అయితే ఈ మధ్య కాలంలో 50 డేస్ ఫంక్షన్లను చేయడం కూడా మరిచిపోయారు.పెద్ద సినిమాలు థియేటర్లలో 50 రోజులు ప్రదర్శితం కావడం ఇప్పుడు గగనమవుతోంది. అయితే సీనియర్ స్టార్ బాలయ్య నటించిన అఖండ సినిమా మాత్రం 50 డేస్ సెంటర్ల విషయంలో సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తుండటం గమనార్హం. సంక్రాంతి పండుగకు రిలీజైన సినిమాలలో బంగార్రాజు సినిమాకు అయితే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే బంగార్రాజు సినిమాకు టికెట్లు దొరకని ప్రేక్షకులు అలాగే అఖండ సినిమాను ఇప్పటివరకు చూడని ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు, ఓటీటీలో అఖండ సినిమా అందుబాటులో లేకపోవడంతో ప్రేక్షకులకు ప్రస్తుతం థియేటర్లలో మాత్రమే అఖండ సినిమాను చూసే అవకాశం చాలా ఉంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా అఖండ సినిమా మంచి కలెక్షన్లను సొంతం చేసుకుందని సమాచారం తెలుస్తుంది. కేవలం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ సినిమా సంక్రాంతి పండుగ రోజున రెండు లక్షల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందని సమాచారం తెలుస్తోంది.వీకెండ్ లో అఖండ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో షేర్ కలెక్షన్లను సాధించిందని సమాచారం తెలుస్తుంది. అఖండ సినిమా ఇప్పుడు 50కు పైగా థియేటర్లలో తెలుగు రాష్ట్రాలలో ప్రదర్శితమవుతోందని సమాచారం తెలుస్తోంది. ఈ థియేటర్లలో అఖండ సినిమా 50 రోజుల వేడుకలను జరుపుకోవచ్చట. ఇక తొలిరోజు డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ అఖండ సినిమా అసలు ఈ స్థాయిలో థియేటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శితం కావడం నిజంగా ఓ సంచలనం అనే చెప్పాలి. బాలయ్య బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ అఖండ మూవీ నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: