డెబ్యూ హీరోలకు ఏమాత్రం కలిసి రాలేదా!!

P.Nishanth Kumar
సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాల లో రెండు సినిమాలు కొత్త హీరోలు నటించిన సినిమాలు అనే సంగతి చాలా మందికి తెలుసు. అయితే వారికి బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో వారు తమ సినిమాలను ఎంతో గ్రాండ్ గా విడుదల చేశారు. రెగ్యులర్ గా కొత్త హీరోల సినిమాలు ఎలాంటి హడావుడి లేకుండా విడుదల అవుతాయి. కానీ వీరి సినిమా కు పండగకు రావడం విశేషం. అయితే ఈ సంక్రాంతి ఎంతవరకు వారికి కలిసి వచ్చింది. ఎంతో పోటీపడి మరీ తమ సినిమాలను విడుదల చేసిన వీరికి ఈ సంక్రాంతి సక్సెస్ ను ఇచ్చిందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రేజీ సినిమాలలో ఒకటి హీరో. అశోక్ కుమార్ గల్లా హీరోగా పరిచయమైన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవడం కొంత రిస్క్ అనిపించిన ఇది ఈ సినిమా పట్ల ఉన్న నమ్మకాన్ని ఇది తెలియజేస్తుంది అని చెప్పవచ్చు. మహేష్ బాబు కి అల్లుడు కావడం తో ఈ సినిమాపై సూపర్ స్టార్ అభిమానుల్లో సైతం మంచి నమ్మకాలు ఏర్పడ్డాయి. మహేష్ బాబు కూడా దీన్ని ప్రమోట్ చేయడంతో ప్రేక్షకుల్లో కూడా సినిమా పట్ల కొంత ఆసక్తి ఏర్పడింది. 

అయితే ప్రమోషన్ అయితే గట్టిగా చేశారు కానీ సినిమాలో విషయం అంతగా లేదని ప్రేక్షకులు తేల్చేశారు. దాంతో ఎన్నో ఆశలు పెట్టుకొని సినిమా చేసిన గల్లా అశోక్ ఈ సినిమాతో పెద్ద సాధించింది ఏదీ లేదని చెప్పవచ్చు. ఇకపోతే ఇదే సీజన్ కు దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా నటించిన రౌడీ బాయ్స్ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించడంతో పాటు ఈ సినిమాలో ఆమె గ్లామర్ షో చేయడం సినిమా పై ఆసక్తి ఏర్పడటానికి ప్రధాన కారణం అయింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది అని చెప్పవచ్చు. గ్లామర్ చూపించడంలో చూపించిన శ్రద్ధ సినిమా కథ విషయంలో చూపిస్తే బాగుండేది అని ప్రేక్షకులు వాపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: