వావ్: హీరో నిఖిల్ సిద్దార్ద్ నటించిన సీరియల్ ఏంటో తెలుసా..?

N.ANJI
సాధారణంగా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా రాణించాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఇండస్ట్రీకి చాలా మంది నటులు ఎన్నో కష్టాలు పడి ప్రస్తుతం స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో హీరో నిఖిల్ ఒక్కరు. ఆయన తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.
ఇక నిఖిల్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన హైదరాబాదులో బేగంపేటలో 1985 జూన్ 1వ తేదీన  పుట్టారు. నిఖిల్ విద్యాభ్యాసం అక్కడే పబ్లిక్ స్కూల్ లో పూర్తి చేశాడు. ఆయన మొదట హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశాడు. ఆ తరువాత నిఖిల్ కి నటన మీద ఆసక్తి పెరగడంతో ఎన్. జె.భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో నలుగురు స్నేహితుల పాత్రలో హీరో నిఖిల్ కూడా నటించిన విషయం తెల్సిందే.
హ్యాపీడేస్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో నిఖిల్ నటనకు కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తరువాత నిఖిల్ కళావర్ కింగ్, యువత, వీడు తేడా వంటి మరికొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అంతగా ఆశించిన ఫలితం అందుకోలేకపోయాడు. ఇక అదే సమయంలో డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం స్వామిరారా.. ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోయింది. ఈ చిత్రం తరువాత నిఖిల్ వెనక్కి తిరిగి చూడలేదు.
అందరికి తెలియని ఇంకో విషయం ఏంటంటే.. నిఖిల్ కెరియర్ మొదట్లో ఒక సీరియల్లో నటించారు. ఇంతకీ ఆ సీరియల్ ఏంటి అని అనుకుంటున్నారా.. అప్పట్లో ఈటీవీలో ప్రసారమైన చదరంగం సీరియల్. ఈ ధారావాహికలో రాజీవ్ కనకాల,తనికెళ్ల భరణి కూడా నటించారు. ఇక ప్రస్తుతం నిఖిల్  కార్తికేయ సినిమాకి సీక్వెల్ గానటిస్తున్నారు. అంతేకాదు.. 18- పేజీస్ అనే మరొక సినిమాలో కూడా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: