ఈ ఏడాది టాప్ సినిమాల రిలీజ్ డేట్స్ ఏవి?

Purushottham Vinay
2021 ఎండింగ్ లో రెండు బ్లాక్ బస్టర్ విజయాలు టాలీవుడ్ కి ఊపిరిపోసాయి. కరోనా వైరస్ మహమ్మారీ భయపెడుతున్నా కానీ.. ఈ విజయాలు ఆశలని పెంచాయి. అయితే సంక్రాంతి 2022 మాత్రం ఇండస్ట్రీకి తీవ్ర నిరాశనే మిగిల్చింది.ఇక కొత్త సంవత్సరం ఆరంభమే వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలు రిలీజవుతాయని ఆశించిన వారికి కరోనా రూపంలో షాక్ తప్పలేదు. వరసగా భారీ రిలీజ్ లు వాయిదాలు అనేది కొనసాగింది. సంక్రాంతి బరి నుంచి పాన్ ఇండియా సినిమాలన్ని కూడా వైదొలగడంతో నాగార్జున-చైతన్య నటించిన బంగార్రాజు సినిమా మాత్రమే పెద్ద సినిమా కేటగిరీలో విడుదలైంది. డెబ్యూ హీరోలు నటించిన సినిమాలు కూడా విడుదలయ్యాయి.ముందే సంక్రాంతి పండుగ డేట్ ని లాక్ చేసుకుని భీమ్లా నాయక్ సినిమా అనూహ్యంగా పోటీనుంచి వైదొలగడంపై చర్చ అనేది సాగింది. ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం సైడివ్వడం భీమ్లా నాయక్ కి మైనస్ కాగా ఇది బంగార్రాజు సినిమాకు ప్లస్ అయ్యిందన్న గుసగుస అనేది వినిపిస్తోంది.

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా .. ఇంకా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా కూడా అనూహ్యంగా సంక్రాంతి రేసు నుంచి వైదొలగి రిలీజ్ డేట్ లు మార్చుకున్నాయి. దీంతో ఎక్కడా లేని కన్ఫ్యూజన్ అనేది తలెత్తింది. ఈ భారీ సినిమాల రిలీజ్ డేట్ లపై ఇప్పటికీ ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు ఆచార్య- కేజీఎఫ్ 2 లాంటి సినిమాల రిలీజ్ డేట్ లపైన కూడా ఈ కన్ఫ్యూజన్ నెలకొంది. దీంతో సోషల్ మీడియాల్లో ఏ సినిమాలని ఇక ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనే దానిపై అభిమానుల్లో కూడా ఆసక్తికర చర్చ అనేది సాగుతోంది.ఇండస్ట్రీ ఇన్ సైడ్ గాసిప్ ల ప్రకారం.. ఫిబ్రవరి నెల 25 వ తేదీన భీమ్లా నాయక్ సినిమా విడుదలవుతుంది.

ఆ తర్వాత మార్చి 18 వ తేదీన రాధేశ్యామ్ విడుదలకు రెడీ అవుతుండగా.. ఏప్రిల్ 1 వ తేదీన ఆచార్య సినిమా విడుదలవుతుంది. అటుపై ఏప్రిల్ నెల 29 వ తేదీన అత్యంత భారీగా ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలవుతుందని డేట్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇక వీటన్నిటి తర్వాత మే 13 వ తేదీన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సర్కార్ వారి పాట విడుదలవుతుందని గెస్ చేస్తున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 వర్సెస్ బీస్ట్ సినిమాలు ఫిక్సయిన విషయం తెలిసిందే.ఇక అదే రోజు నాగచైతన్య హిందీ డెబ్యూ మూవీ లాల్ సింగ్ చద్దా (అమీర్ ఖాన్) సినిమా కూడా రిలీజవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: