గిన్నీస్ బుక్ లో త‌మ పేరును ల‌ఖించుకున్న తెలుగు తార‌లు వీళ్లే!

VUYYURU SUBHASH
మానవుల ప్రతిభను గుర్తించి ప్ర‌పంచానికి పరిచయం చేసేదే ఈ `గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు`. అత్యంత అరుదైన ఈ గినీస్ బుక్ లో త‌మ పేరును చూసుకోవాల‌న్న కోరిక ప్ర‌తిభావంతులంద‌రికీ ఉంటుంది. కానీ, ఆ అదృష్టం కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే ద‌క్కుతుంది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోనూ కొంద‌రు తార‌ల త‌మ పేరుకు గిన్నీస్ బుక్‌లో లిఖించుకుని అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నారు. మ‌రి ఆ కొంద‌రు తార‌లు ఎవ‌రెవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రహ్మానందం: కామెడీ కింగ్ కన్నెగంటి బ్రహ్మానందం గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.  లెక్చరర్ ఉద్యోగాన్ని వ‌దిలేసి సినిమాల్లోకి వ‌చ్చిన ఈయ‌న‌.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ హీరోతో స‌మానంగా ఫాలోయింగ్‌ను పెంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే వివిధ భాషలలో వెయ్యికి పైగా సినిమాల్లో నటించినందుకు గానూ..ఆయ‌న‌ 2010 లో గిన్నిస్ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కారు.
డి.రామానాయుడు: నటుడిగా, బ‌డా నిర్మాతగా, భారత పార్లమెంటు మాజీ సభ్యుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు వంద‌ చిత్రాలు నిర్మించారు. దీంతో అత్యధిక సినిమాలు నిర్మించిన నిర్మాత‌గా ఆయ‌న‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు.
పి.సుశీల: పి.సుశీల అంటే తెలియ‌ని సంగీత ప్రియుడు ఉండ‌డు. దాదాపు ఆరు దశాబ్దాలు సింగర్ గా చిత్ర పరిశ్రమకు సేవలు అందించారీమె.  భాష ఏదయినా కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్ఛారణకి సుశీల పెట్టింది పేరు. అటువంటి సుశీల 17,695 పాటల‌ను ఆల‌పించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో త‌న పేరును ల‌ఖించుకున్నారు.
గజల్ శ్రీనివాస్: ప్రముఖ తెలుగు గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ ఏకంగా 125 ప్రపంచ భాషల్లో గజల్స్ పాడటం ద్వారా గిన్నీస్ బుక్‌లో త‌న పేరును పొందుప‌రుచుకున్నాడు.
విజయ నిర్మల: అల‌నాటి హీరోయిన్‌, సూప‌ర్ స్టార్ కృష్ణ స‌తీమ‌ణి విజ‌య నిర్మ‌ల‌..44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. దీంతో అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించిన మహిళగా ఆమె గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో స్థానాన్ని సంపాదించుకున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: