రిలీజ్ డేట్లు ఎనౌన్స్ చేస్తే సరిపోతుందా మాష్టారు..?

shami
కరోనా వల్ల ఎన్ని పరిశ్రమలు దెబ్బ తిన్నాయో ప్రత్యక్షంగా అందరికి తెలిసిందే. ముఖ్య్హంగా సినీ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది.లాక్ డౌన్ టైం లో సరైన పని లేకా సినీ పరిశ్రమకు చెందిన వర్కర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. కొందరు సినీ పెద్దలు తమ పెద్ద మనసుతో కొంతమేరకు ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇదిలాఉంటే కొవిడ్ వల్ల ఏ సినిమా ఎప్పుడు వస్తుంది. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారన్నది కన్ ఫ్యూజింగ్ గా మారింది.
ఓ పెద్ద సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం రిలీజ్ టైం కి కరోనా కేసులు పెరిగాయని కొన్ని చోట్ల ఆంక్షలు పెట్టడం ఆ సినిమా రిలీజ్ వాయిదా వేయడం ఇదే సీన్ రిపీట్ అవుతూ వస్తుంది. కొవిడ్ టైం లో పెద్ద సినిమాల పరిస్థితి చాలా దారుణంగా మారింది. సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాల్సిన అవకాశం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. సంక్రాంతికి రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అనుకున్నారు. కానీ నార్త్ సైడ్ కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల తీవ్రత వల్ల మళ్లీ థియేటర్లని మూసి వేయడం లాంటివి జరిగాయి. అందుకే ఆ రెండు సినిమాలు చివరి నిమిషంలో రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నాయి.
ఇక మరోపక్క కేవలం తెలుగు రాష్ట్రల్లో రిలీజ్ అయ్యే సినిమాల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. పోటీ పడి రిలీజ్ డేట్లు ఎనౌన్స్ చేయడం కట్ చేస్తే ఆ టైం కి రిలీజ్ కి ఏదో ఒక అడ్డంకులు రావడం సహజం గా మారింది. డేర్ చేసి రిలీజ్ చేద్దామని అనుకుంటే ఖచ్చితంగా కలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఈ టైం లో అసలు రిలీజ్ డేట్లు ప్రకటించాల్సిన అవసరం ఏముందని ఆడియెన్స్ అనుకుంటున్నారు. లేటెస్ట్ గా ఫిబ్రవరి 4న రిలీజ్ అవ్వాల్సిన ఆచార్య సినిమాను ఏప్రిల్ 1కి వాయిదా వేశారు. ఆ డేట్ న రిలీజ్ అనుకున్న మహేష్ సర్కారు వారి పాట మరో డేట్ చూసుకునే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ వరకు పరిస్థితి అంతా నార్మల్ గా ఉంటే ఆచార్య రిలీజ్ అవుతుంది. ఒకవేళ అప్పటికి పరిస్థితి ఇలానే ఉంటే మళ్లీ వాయిదా వేయక తప్పదు. మరి అలాంటప్పుడు రిలీజ్ డేట్ ప్రకటించడం ఎందికని సినీ ప్రముఖులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: