ఈ కుర్ర భామకు అంత సీన్ ఉందా!

P.Nishanth Kumar
ఏదైనా సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా ఎదగాలి అంటే లాంగ్ రన్ లో తప్పకుండా మంచి సక్సెస్ ఆ హీరోయిన్ ఖాతాలో ఉండాలి. మొదట్లో సక్సెస్ లు అందుకునీ ఆ తరువాత ఫ్లాప్ లు ఎదురైతే తప్పకుండా ఆమె కెరియర్ అర్ధాంతరంగా ముగిసిపోతుంది. అలా కాకుండా యావరేజ్ హిట్ వచ్చినా కూడా మంచి సినిమాలతో మంచి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రేక్షకుల అభిమానాన్ని భారీ పాపులారిటీ ను అందుకోవాలి.  అలా చేస్తేనే సదరు హీరోయిన్ అగ్ర కథానాయికగా ఎదిగి మంచి పారితోషకం అందుకుంటుంది.

అలా సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా ఎదిగెందుకు రెడీగా ఉంది కృతి శెట్టి. ఆమె నటించిన తొలి సినిమా ఉప్పెన ఎంత పెద్ద హిట్ అయిందో అంతకంటే ఎక్కువగా మంచి పేరు సంపాదించుకుంది కృతి. హీరో ని మించిన రేంజ్ లో నటించి పాపులారిటీ అందుకొని తన కోసమే ఆ సినిమా చేసినట్లుగా చేసుకుంది. కళ్ళతోనే నటించి ప్రేక్షకులను ఎంతో అలరించింది. ఈమె తప్పకుండా పెద్ద హీరోయిన్ అవుతుందని అప్పుడే సినీ పండితులు జోస్యం చెప్పారు. వారు చెప్పినట్లు గానే ఆమె చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అయి ఆమెకు మంచి సక్సెస్ రేట్ ను అందించింది. అంతే కాదు ఆమె పాత్ర కూడా బాగా ఉండడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది బేబమ్మ. 

ఆమె రెండవ చిత్రంగా చేసిన శ్యామ్ సింగ రాయ్ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో ఆమె చేసిన గ్లామర్ రోల్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. వాస్తవానికి ఆ సినిమా హిట్ అయ్యింది కూడా ఈమె వల్లేనన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువైపోయాయి. ఇక ఆమె మూడవ సినిమాగా చేసిన బంగార్రాజు చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకోగా వరుసగా మూడవ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ విధంగా లక్కీ హీరోయిన్ గా పేరు సంపాదించుకునీ ఇప్పుడు పెద్ద హీరోల సినిమా అవకాశాలు దక్కించుకోవడానికి రెడీగా ఉంది. మరి ఒక సాలిడ్ కమర్షియల్ సినిమా హిట్ అయితే ఆమె నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం ఖాయం కాబట్టి కృతి శెట్టి ఆ సాలిడ్ హిట్ ను ఏ విధంగా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: