విడుదలై నెల దాటుతున్నా తగ్గని పుష్ప క్రేజ్!!
ఈ సినిమాకు మొదటి నుంచి బాలీవుడ్ సినిమా పరిశ్రమ బాలీవుడ్ సినిమా ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదు. తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమాను నెత్తిమీద పెట్టుకుని అందలం ఎక్కించింది బాలీవుడ్ సినిమా పరిశ్రమ. అక్కడి వారికి ఈ సినిమా బాగా దగ్గర అవ్వడంతో పాటు ఫ్రెష్ గా అనిపించడంతో ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది. వాస్తవానికి అల్లు అర్జున్ కు తెలుగులోనే భారీ స్థాయిలో అభిమానులు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సినిమా ను వీక్షిస్తూ ఉంటారు. అలాంటిది తెలుగులో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి చిత్ర యూనిట్ చాలా భయపడ్డారు.
ఎన్నో ఆశలు పెట్టుకుని పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఈ సినిమా తొలి వారం వచ్చిన టాక్ తో వారం రోజులు ఎంతగానో బాధ పడ్డారు కానీ ఆ తర్వాత కానీ అసలు సంగతి బయట పడలేదు. మెల్లమెల్లగా ఈ చిత్రం బాలీవుడ్ లో ప్రేక్షకులందరికీ ఎక్కడం మొదలు పెట్టింది. అందుకే కాబోలు ఈ సినిమా దేశవ్యాప్తంగా ఇప్పుడు పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకు వెళుతోంది. అమెజాన్ లో విడుదలైన కూడా ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ మామూలుది కాదు. దేశ స్థాయి సెలబ్రిటీలు ప్రపంచ స్థాయి సెలబ్రిటీలు అందరూ కూడా ఈ సినిమాపై షార్ట్ వీడియోలు చేయడం అందరిని ఎంతగానో అలరిస్తుంది.